: అబ్దుల్ ‘కలాం’పై చిత్రం... మాజీ రాష్ట్రపతి పాత్రలో బిగ్ బీ?


భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాంపై ఓ చిత్రం నిర్మితం కానుంది. గతంలో ‘ఐ యామ్ కలాం’ పేరిట విమర్శకుల ప్రశంసలందుకున్న చిత్రాన్ని తెరకెక్కించిన బాలీవుడ్ దర్శకుడు మాధవ్ పాండా ఇప్పుడీ చిత్రాన్ని కూడా రూపొందించనున్నారట. మాధవవ్ పాండానే స్వయంగా ఈ విషయం వెల్లడించారు. మరి ‘కలాం’ టైటిల్ తో తెరకెక్కనున్న ఈ చిత్రంలో కలాం పాత్రలో ఎవరు నటిస్తారని పాండాను అడగ్గా, బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ అయితే బాగుంటుందని తన మనసులోని మాటను బయటపెట్టారు. ‘‘కలాం పాత్ర పోషించగల వ్యక్తి అమితాబ్ మాత్రమే. దేశవ్యాప్తంగా ఎందరో అభిమానులున్న అమితాబ్ కలాం పాత్రలో చక్కగా ఇమిడిపోతారు’’ అని మాధవ్ పాండా పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News