: రెండు కేంద్ర పదవులు మాకు ముఖ్యం కాదు... ప్రత్యేక హోదానే ముఖ్యం: లోక్ సభలో టీడీపీ ఎంపీ
ఏపీకి ప్రత్యేక హోదాపై లోక్ సభలో టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్ గళమెత్తారు. కేంద్రంలో టీడీపీకి ఉన్న రెండు మంత్రి పదవులు తమకు ముఖ్యం కాదని... ప్రత్యేక హోదానే తమకు ముఖ్యమని ఆయన అన్నారు. రాష్ట్ర విభజనతో ఏపీకి తీరని నష్టం వాటిల్లిందని తెలిపారు. రాజధానిని కూడా నిర్మించుకోవాల్సి ఉందని చెప్పారు. ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంటులో ప్రకటించారని... ఎన్నికల మేనిఫెస్టోలో బీజేపీ కూడా పెట్టిందని గుర్తు చేశారు. ప్రత్యేక హోదాపై ఎంతో ఆశ పెట్టుకున్న ప్రజలు ప్రస్తుతం చాలా ఆందోళనతో ఉన్నారని చెప్పారు.