: పవన్ కల్యాణ్ గారూ... తక్షణమే ఆదుకోండి: గుంటూరు భజరంగ్ మిల్లు కార్మికుల మొర


గుంటూరులో భజరంగ్ మిల్లు కార్మికులు జనసేన అధినేత, టాలీవుడ్ అగ్ర నటుడు పవన్ కల్యాణ్ సాయం కోసం ఎదురుచూస్తున్నారు. వందల మంది కార్మికులకు ఉపాధి కల్పిస్తున్న సదరు మిల్లు కొద్దిరోజుల క్రితం మూతపడింది. మిల్లు మూతపడిన నేపథ్యంలో పెద్ద సంఖ్యలో కార్మికులు రోడ్డున పడ్డారు. మిల్లును ఎలాగైనా తెరిపించుకోవాలని కార్మికులు గత కొన్ని రోజులుగా మిల్లు ముందు దీక్షలు చేస్తున్నారు. రెండు నెలలుగా కార్మికులు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం నుంచి కాని, యాజమాన్యం నుంచి కాని ఎలాంటి స్పందన లేదు. దీంతో నేటి దీక్షల్లో భాగంగా కార్మికులు పవన్ కల్యాణ్ శరణు వేడారు. ప్రశ్నిస్తానన్న మీరు ఎక్కడున్నా వెంటనే వచ్చి తమను ఆదుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.

  • Loading...

More Telugu News