: ఫేస్ బుక్, ట్విట్టర్లపైనా నిషేధం విధిస్తారేమో...కేంద్రంపై బాలీవుడ్ భామ మనీషా లాంబా విసుర్లు
పోర్న్ సైట్లపై నిషేధం విధిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రముఖులు, సెలబ్రిటీల విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఇప్పటికే రామ్ గోపాల్ వర్మలాంటి పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వంపై తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తాజాగా బాలీవుడ్ బ్యూటీ మనీషా లాంబా వంతు వచ్చింది. ఇప్పుడు పోర్న్ సైట్లను నిషేధించిన ప్రభుత్వం... త్వరలో ఫేస్ బుక్, ట్విట్టర్, యూట్యూబ్ లపైనా నిషేధం విధిస్తుందేమోనని ఆమె వ్యాఖ్యానించింది. సోషల్ నెట్ వర్కింగ్ సైట్లను నిషేధిస్తే పుస్తకాలు చదువుకోవచ్చులే అనుకుంటున్నారేమో?... మిమ్మల్ని పుస్తకాలు కూడా చదువుకోకుండా నిషేధం విధిస్తారని ఆమె తన నిరసనను వ్యక్తం చేసింది.