: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో కొట్టుకున్న విద్యార్థులు
హైదరాబాదులోని 'హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ' (హెచ్ సీయూ)లో ఈ ఉదయం విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణ జరిగింది. అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ), అంబేద్కర్ స్టూడెంట్స్ యూనియన్ ల మధ్య మొదలైన గొడవ నేపథ్యంలో విద్యార్థులు ఒకరినొకరు కొట్టుకున్నారు. ఈ ఘటనలో ఏబీవీపీ నేత సుశీల్ గాయపడ్డాడు. అంబేద్కర్ స్టూడెంట్స్ యూనియన్ తమపై అకారణంగా దాడికి దిగిందని ఆరోపిస్తూ, ఏబీవీపీ స్టూడెంట్స్ రహదారిపై బైఠాయించి ధర్నాకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గాయపడ్డ సుశీల్ ను ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. పరిస్థితి మరింతగా అదుపు తప్పకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.