: ఖర్చు చేసే అభ్యర్థే బెటర్... ‘ఓరుగల్లు’ బరిలోకి మీరాకుమార్ కోసం టీ పీసీీసీ వ్యూహం
వరంగల్ లోక్ సభ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ లోక్ సభ స్పీకర్ మీరాకుమార్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసేందుకు టీ పీసీసీ వ్యూహాత్మంగా అడుగులు వేస్తోంది. తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ ను ఢీకొట్టేందుకు భారీ ఎత్తున ఖర్చు చేయాల్సి ఉందని, ఆ మేర ఖర్చు పెట్టగలరా? అంటూ ఆశావహులకు ప్రశ్నలు సంధిస్తోంది. లోక్ సభ ఎన్నికల ఖర్చు అంటే ఆషామాషీ కాదన్న విషయం అవగతమైన పలువురు ఆశావహులు ఇప్పటికే ఈ సీటుపై ఆశలు వదులుకున్నారని విశ్వసనీయ సమాచారం. ఆశావహులందరినీ పక్కకు తప్పించిన అనంతరం మీరాకుమార్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తే, ఎన్నికల ఖర్చంతా ఏఐసీసీ పెద్దలే భరిస్తారన్న వ్యూహంతోనూ టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పావులు కదుపుతున్నట్లు ప్రచారం సాగుతోంది.