: ఏపీ సర్కార్ పై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు విమర్శలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు విమర్శలు చేశారు. ఎప్పుడూ కష్టాల్లోనే ఉన్నామని ఏపీ నేతలు చెప్పడం దురదృష్టకరమన్నారు. ప్రత్యేక హోదా రాలేదని చెప్పడంకంటే వచ్చిన దాన్ని ఎందుకు ప్రస్తావించడం లేదని అడిగారు. ఏపీ కష్టాల్లో ఉంటే రూ.1600 కోట్లతో గోదావరి పుష్కరాలు ఎలా నిర్వహించారని సూటిగా ప్రశ్నించారు. కాగా, ఇప్పటికే ప్రత్యేక హోదాపై కేంద్రం చేసిన ప్రకటనతో బీజేపీపై టీడీపీ నేతలు లోలోపల గుర్రుగా ఉన్నారు. మరి, వీర్రాజు మాటలపై ఎలా స్పందిస్తారనేది చూడాల్సి ఉంది.