: 29 మంది హైకోర్టు జడ్జీల్లో 25 మంది ఆంధ్రావారే...లోక్ సభలో జితేందర్ రెడ్డి
తెలంగాణ ప్రత్యేక హైకోర్టు ఏర్పాటుపై టీఆర్ఎస్ నేత, మహబూబ్ నగర్ ఎంపీ జితేందర్ రెడ్డి కొద్దిసేపటి క్రితం లోక్ సభలో తనదైన రీతిలో గళమెత్తారు. తెలంగాణతో పాటు ఏపీకి ఉమ్మడిగా కొనసాగుతున్న హైకోర్టులో 29 మంది న్యాయమూర్తులుంటే, వారిలో 25 మంది సీమాంధ్రకు చెందినవారేనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రాంతానికి చెందిన న్యాయమూర్తులు లేని నేపథ్యంలో తమకు తీరని అన్యాయం జరుగుతోందని ఆయన అన్నారు. తక్షణమే హైకోర్టు విభజన జరిగితే తమ ప్రాంతానికి చెందిన న్యాయమూర్తుల సమక్షంలో తమకు న్యాయం జరుగుతుందని జితేందర్ రెడ్డి వాదించారు.