: ఏపీకి ప్రత్యేక హోదా ఎందుకివ్వరు?: లోక్ సభలో నిలదీసిన మేకపాటి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని లోక్ సభలో వైకాపా ఎంపీ మేకపాటి పట్టుబట్టారు. ఆంధ్రప్రదేశ్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉందని... ప్రత్యేక హోదాతోనే ఏపీకి న్యాయం జరుగుతుందని ఆయన లోక్ సభకు విన్నవించారు. ప్రత్యేక హోదా కోసం ఏపీలో ఆందోళనలు జరుగుతున్నాయని... ఈ పరిస్థితుల్లో ప్రత్యేక హోదాపై కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రకటించారని... ఇప్పడు ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఇచ్చే పరిస్థితి లేదన్న కేంద్ర మంత్రి ప్రకటనతో ఏపీ ప్రజలు ఆందోళన చెందుతున్నారని అన్నారు.