: జగన్... ఏపీకి ధృతరాష్ట్రుడు, ప్రాజెక్టుల పాలిట సైంధవుడు: ఏపీ మంత్రి పల్లె ధ్వజం


వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ధ్వజమెత్తారు. కొద్దిసేపటి క్రితం విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన జగన్ ను ధృతరాష్ట్రుడిగానే కాక సైంధవుడిగానూ అభివర్ణించారు. స్థాయి మరచి మాట్లాడుతున్న జగన్ కు సీఎం నారా చంద్రబాబునాయుడిని విమర్శించే అర్హత లేదన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా గురించి నోరు విప్పకుండా జగన్ రాష్ట్రానికి ధృతరాష్ట్రుడిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సాగు నీటి ప్రాజెక్టులకు అడ్డుతగులుతున్న జగన్, ప్రాజెక్టుల పాలిట సైంధవుడిగా మారిపోయారని పల్లె దుమ్మెత్తిపోశారు.

  • Loading...

More Telugu News