: టీడీపీ సర్వేలో జగన్ కు 131వ స్థానం
ఏపీలోని అన్ని నియోజకవర్గ ఎమ్మెల్యేలపై టీడీపీ సర్వే చేయించుకుంది. పార్టీలతో సంబంధం లేకుండా అందరి పనితీరుపై సర్వే జరిగింది. ఈ సర్వేలో విస్తుగొలిపే విషయమే వెల్లడైంది. వైకాపా అధినేత, పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డికి సర్వేలో 131వ స్థానం దక్కింది. వైకాపాలో మాడుగుల ఎమ్మెల్యే ముత్యాల నాయుడు తొలి స్థానంలో ఉన్నారు. ఓవరాల్ గా ఆయన 23వ స్థానంలో ఉన్నారు. గత ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిచిన జగన్ కు టీడీపీ సర్వేలో 131వ స్థానం రావడం విశేషం.