: బీహార్ కు ప్రత్యేక హోదా నిరాకరించడం క్రూరమైన జోక్: నితీష్ కుమార్
పార్లమెంటరీ ఎన్నికల ప్రచారంలో బీహార్ కు ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చిన ప్రధానమంత్రి నరేంద్రమోదీపై ఆ రాష్ట్ర సీఎం నితీష్ కుమార్ మండిపడ్డారు. ప్రత్యేక హోదా నిరాకరించడం ఓ క్రూరమైక్ జోక్ గా అభివర్ణించారు. "ప్రజలు తప్పకుండా ఈ నమ్మక ద్రోహాన్ని అర్థం చేసుకుంటారు. బీహార్ ప్రజలకు ఇదొక క్రూరమైన జోక్" అని నితీష్ విమర్శించారు. ఇప్పట్లో ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే ప్రశ్నే లేదంటూ జులై 31న కేంద్ర మంత్రి రావు ఇంద్రజిత్ సింగ్ ప్రకటన చేసిన నేపథ్యంలో నితీష్ పైవిధంగా మాట్లాడారు. కేంద్రంలో తాము అధికారంలోకి వస్తే బీహార్ కు ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చిన మోదీ ప్రసంగం రికార్డులను నిరంతరం ప్లే చేస్తూనే ఉంటామని ఆయన అన్నారు.