: కరాటే క్రీడాకారిణికి ఆర్థిక సాయం అందించిన కేసీఆర్


ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న కరాటే క్రీడాకారిణి సయిదా ఫలక్ తో పాటు తెలంగాణ తొలి మహిళా పైలట్ గంటా స్వాతిరావులకు ఆర్థిక సాయం చేస్తామని టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. చెన్నై ఓపెన్ కరాటే ఛాంపియన్ షిప్ లో గోల్డ్ మెడల్ సాధించిన సయిదా జపాన్ లో జరిగే సీనియర్ ఆసియా కరాటే పోటీలకు అర్హత సాధించింది. దీంతో, మెరుగైన శిక్షణ కోసం తనకు ఆర్థిక సాయం చేయాలని ముఖ్యమంత్రికి ఆమె విజ్ఞప్తి చేసింది. అలాగే, ఫిలిప్పీన్స్ లో ఫ్లైట్ ఇన్ స్ట్రక్టర్ గా పని చేస్తున్న స్వాతి ఎయిర్ బస్ పైలట్ శిక్షణ కోసం సహాయం చేయాలని సీఎంను కోరింది. దీంతో, వీరిద్దరికీ సాయం చేస్తామని కేసీఆర్ ప్రకటించారు.

  • Loading...

More Telugu News