: బైక్ తో పాటే హెల్మెట్ కూడా... ఏపీలో అమలు కానున్న కొత్త నిబంధన


కొత్త బైక్ కొనుక్కొని రయ్యిమని దూసుకుపోవడానికి ముందు కాస్తంత జాగ్రత్తలు కూడా పాటించండి అని ఏపీ ప్రభుత్వం సూచిస్తోంది. అంతటితో ఆగని చంద్రబాబు సర్కారు బైక్ తో పాటు వినియోగదారుడికి హెల్మెట్ కూడా ఇచ్చేయండని వాహన విక్రయదారులకు ఆదేశాలు జారీ చేయనుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు మార్గదర్శకాల రూపకల్పనలో నిమగ్నమయ్యారు. వాస్తవానికి ఈ నెల 1 నుంచే ఏపీలో హెల్మెట్ వాడకం తప్పనిసరి. అయితే ఈ నిబంధనను మరికొంత కాలం పాటు సడలిద్దామన్న భావనతో వచ్చే నెల 1 నుంచి ఈ నిబంధనను కఠినంగా అమలు చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా బైక్ ను కొనుగోలు చేసే వినియోగదారులకు షోరూం యజమానులు హెల్మెట్లను కూడా అందించనున్నారు. బండి కొంటే, హెల్మెట్ ఫ్రీగా వస్తుందిగా అని సంబరపడిపోకండి. ఎందుకంటే బైక్ ఖరీదుతో పాటు హెల్మెట్ ఖరీదును కూడా షోరూం డీలర్లు మీ ముక్కు పిండి మరీ వసూలు చేస్తారట. నాణ్యమైన హెల్మెట్లను పంపిణీ చేయాలని భావిస్తున్న ప్రభుత్వం, ఏ కంపెనీకి చెందిన శిరస్త్రాణాలైతే బాగుంటాయో సూచించాలని రవాణా శాఖను ఆదేశించింది.

  • Loading...

More Telugu News