: వివాహ బహుమతిగా బ్రోకర్ కు ఓ దీవిని కొనిచ్చిన ఫుట్ బాల్ స్టార్ రొనాల్డో
ప్రముఖ ఫుట్ బాల్ స్టార్ క్రిస్టియానా రొనాల్డో, తనకు బ్రోకర్ గా పనిచేసి, మాంచెస్టర్ యునైటెడ్, రియల్ మాడ్రిడ్ కాంట్రాక్టులను అందించిన ఏజంటుకు వివాహ బహుమతిగా ఓ గ్రీక్ దీవిని ఇవ్వనున్నాడు. తన ఏజంట్ గా, మంచి మిత్రుడిగా ఉన్న జార్జ్ మెండిస్ కు వెడ్డింగ్ గిఫ్ట్ గా దీవిని ఇవ్వనున్నట్టు ఆయన తెలిపారు. కాగా, తీవ్ర ఆర్థిక కష్టాల్లో ఉన్న గ్రీస్ తమ అధీనంలో ఉన్న పలు దీవులను అమ్మకానికి పెట్టింది. తన కెరీర్ ప్రారంభం నుంచి వందల కోట్ల రూపాయల విలువైన కాంట్రాక్టులు తెచ్చి పెట్టిన మెండిస్ కు అద్భుత బహుమతి ఇవ్వాలని నిర్ణయించుకున్నానని, దీవిని గిఫ్ట్ గా ఇవ్వాలన్న వినూత్న ఆలోచన వచ్చిందని రొనాల్డో అంటున్నాడు.