: కలాంకు నివాళిగా నాలుగు రోజుల పాటు అదనంగా పనిచేయనున్న మద్రాస్ హైకోర్టు
మాజీ రాష్ట్రపతి, దివంగత ఏపీజే అబ్దుల్ కలాం బతికున్న సమయంలో చెప్పిన మాటను మద్రాస్ హైకోర్టు ఇప్పుడు ఆచరించాలని నిర్ణయించుకుంది. తాను చనిపోతే సెలవు ఇవ్వొద్దని, వీలుంటే అదనంగా పని చేయాలని చెప్పిన విషయం తెలిసిందే. ఆయనకు నివాళిగా ఈ రోజు నుంచి శుక్రవారం వరకు కోర్టు సమయం కంటే కొంత అదనంగా పని చేయనున్నట్టు చీఫ్ జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ ఓ ప్రకటనలో తెలిపారు. సాధారణంగా హైకోర్టు సాయంత్రం 4.45 గంటల వరకు పనిచేస్తుంది. కానీ ఈ రోజు నుంచి శుక్రవారం వరకు సాయంత్రం 5 గంటల వరకు కోర్టు పనిచేస్తుందని చెప్పారు. అంటే రోజుకు పావు గంట చొప్పున నాలుగు రోజుల పాటు అదనంగా పని చేస్తామని పేర్కొన్నారు.