: అండమాన్, బెలూచిస్థాన్ లలో భూకంపం
భారత్, పాకిస్థాన్ లలోని రెండు ప్రాంతాల్లో నేటి ఉదయం భూకంపం సంభవించింది. భారత్ భూభాగం పరిధిలోని అండమాన్, నికోబార్ దీవుల్లో స్వల్పంగా భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.5గా నమోదైంది. ఇక పాకిస్థాన్ భూభాగంలోని బెలూచిస్తాన్ లోనూ నేటి ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రతగా నమోదైన ఈ భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టాలు జరగలేదని పాక్ ప్రభుత్వం వెల్లడించింది.