: వనజాక్షిపై రెక్కీ కూడా జరిగిందట!.... బెదిరేది లేదంటున్న తహశీల్దార్
కృష్ణా జిల్లా ముసునూరు తహశీల్దార్ వనజాక్షికి నిన్న అందిన బెదిరింపు లేఖ ఏపీలో కలకలం రేపుతోంది. తమ ఆదేశాలు పాటించని పక్షంలో చంపేస్తామంటూ ‘సీఎన్ టీపీ’ పేరిట గుర్తు తెలియని దుండగులు రాసిన లేఖ నిన్న నేరుగా వనజాక్షి కార్యాలయానికి వచ్చింది. ఈ క్రమంలో వనజాక్షి కార్యాలయంపై ఇప్పటికే రెండు సార్లు రెక్కీ కూడా నిర్వహించామని దుండగులు ఆ లేఖలో పేర్కొన్నారు. బెదిరింపు లేఖను చూసిన వెంటనే వనజాక్షి దీనిపై ముసునూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కొద్దిసేపటి క్రితం తెలుగు న్యూస్ చానెల్ తో మాట్లాడిన ఆమె ఇలాంటి బెదిరింపులకు భయపడేది లేదని తేల్చిచెప్పారు. ఇసుక వివాదంలో తనపై దాడికి దిగిన వారే ఈ లేఖను కూడా రాసి ఉంటారని ఆమె అనుమానం వ్యక్తం చేశారు.