: ర్యాంప్ పై సానియా అదుర్స్!... జ్యూవెలరీ వీక్ లో సందడి చేసిన టెన్నిస్ స్టార్
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా నిన్న ఫ్యాషన్ ర్యాంప్ పై తళుక్కున మెరిసింది. ఇండియా ఇంటర్నేషనల్ జ్యూవెలరీ వీక్ లో భాగంగా నిన్న ముంబైలో నిర్వహించిన ర్యాంప్ వాక్ లో పాల్గొన్న సానియా ఫ్యాషన్ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంది. నిండైన చీరకట్టు, స్లీవ్ లెస్ జాకెట్, మెడ చుట్టూ భారీ కంఠాభరణం, తెలుగుదనం ఉట్టిపడేలా నడుముకు వడ్డాణం, కాళ్లకు హై హీల్స్ తో మెరిసిపోయిన సానియా ఫ్యాషన్ దివాగా వెలిగిపోయింది.