: రేపటి లోక్ సభను బహిష్కరించనున్న ఆరు పార్టీలు


కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 25 మంది లోక్ సభ సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేయడంపై కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. రేపటి లోక్ సభ సమావేశాలను బహిష్కరించాలని ఇతర విపక్ష పార్టీలకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో రేపటి సమావేశాల్లో పాల్గొనకుండా ఉండేందుకు ఏఐసీసీ చీఫ్ సోనియా గాంధీ ఇతర పార్టీల మద్దతు కూడగడుతున్నారు. ప్రతిపక్షపార్టీలను సంప్రదిస్తున్నారు. సోనియా గాంధీ విజ్ఞప్తికి ఎన్సీపీ, తృణమూల్ కాంగ్రెస్, వామపక్ష పార్టీలు, ఆమ్ ఆద్మీ మద్దతు పలికాయి. దీంతో రేపటి సమావేశాలను కాంగ్రెస్ పార్టీతో కలిపి ఈ ఐదు పార్టీలు బహిష్కరించనున్నాయి.

  • Loading...

More Telugu News