: నేను వంట నేర్చుకుంటున్నానోచ్!: 'బొమ్మరిల్లు' హాసిని
'వంట నేర్చుకుంటున్నానోచ్...' అంటూ ఘనంగా ప్రకటించింది 'బొమ్మరిల్లు' సినిమాలో హాసినిగా అలరించిన జెనీలియా డిసౌజా. ఆడపిల్లకి వంట కూడా చేతకాదా? అనకండి. ఎందుకంటే, ఆమెకు ఇంత వరకు వంట చేయాల్సిన అవసరం రాలేదు. సినిమా షూటింగుల్లో బిజీగా వుండేది కాబట్టి, ఆమెకు కిచెన్ లోకి వెళ్లే అవసరం రాలేదు. అంత సమయమూ దొరకలేదు. అయితే ఈ మధ్యే తల్లైన జెనీలియా తన కుమారుడికి చేతి వంట రుచి చూపించాలని భావించినట్టుంది. అందుకే వంట నేర్చుకుంటున్నానంటూ ట్వీట్ చేసింది. తనకో మంచి వంటల గురువు దొరికిందని, వంట నేర్చుకుంటున్నానని ట్విట్టర్లో తెలిపింది.