: కాంగ్రెస్ ను ఇరుకున పెట్టే వ్యూహం అమలులో కేంద్రం
తొమ్మిది రోజులుగా పార్లమెంటు ఉభయసభలను ఆందోళనలతో హోరెత్తిస్తున్న కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టే వ్యూహాన్ని అమలు చేయడానికి కేంద్రం సన్నద్ధమవుతోంది. 'లలిత్ గేట్', 'వ్యాపం' కుంభకోణాలను అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న డ్రామాకు అడ్డుకట్ట వేయాలని కేంద్రం భావిస్తోంది. అందులో భాగంగా భూసేకరణ బిల్లును పార్లమెంటు ముందుకు తీసుకురావాలని భావిస్తోంది. అందులో కీలకమైన ఆరు క్లాజుల సవరణను ఉపసంహరించుకోనుంది. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన బిల్లునే యథాతథంగా పార్లమెంటులో ప్రవేశపెట్టే దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది. ఆరు సవరణలు ఉపసంహరించుకునేందుకు పార్లమెంటరీ సభాసంఘం అంగీకారం తెలిపింది. దీంతో, గతంలో యూపీఏ పార్లమెంటులో ప్రవేశపెట్టిన భూసేకరణ బిల్లునే మరోసారి ప్రవేశపెట్టనుంది. దీంతో కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టవచ్చని కేంద్రం ఆలోచిస్తోంది. మరి కేంద్రం వ్యూహం ఏ రకమైన ఫలితాలు ఇస్తుందో మరోవారం రోజుల్లో తేలిపోనుంది.