: మంత్రి లక్ష్మారెడ్డి ఇంటిని ముట్టడించిన మహిళలు


తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్నప్పటికీ పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి ఇంటిని మహిళలు ముట్టడించారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలోని మంత్రి ఇంటి ముందు బైఠాయించి, మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎన్నికల సమయంలో మంత్రి సతీమణి తమ దగ్గరకు వచ్చి, తాగు నీటి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని... గెలిచి, మంత్రి అయిన తర్వాత ఇచ్చిన హామీని గాలికి వదిలేశారని మహిళలు మండిపడ్డారు. మంత్రి లక్ష్మారెడ్డి చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా, టీఆర్ఎస్ నేతలు మహిళలను సముదాయించి, మూడు రోజుల్లో సమస్యను పరిష్కారం అయ్యేలా చూస్తామని చెప్పి వారిని శాంతింపజేశారు. అయితే, సమస్యను పరిష్కరించకపోతే మళ్లీ ఆందోళన చేస్తామని మహిళలు హెచ్చరించడం కొసమెరుపు.

  • Loading...

More Telugu News