: 'బాహుబలి' ఖాతాలో మరో ఘనత
రాజమౌళి క్రియేషన్ 'బాహుబలి' రికార్డుల పరంపర కొనసాగుతోంది. భారతీయ సినీ పరిశ్రమలో చెరగని ముద్రవేసే దిశగా 'బాహుబలి' సాగుతోంది. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విజయవంతమైన 'బాహుబలి' ఖాతాలో మరోఘనత వచ్చి చేరింది. హిందీలో విడుదలైన 'బాహుబలి' వంద కోట్ల రూపాయల వసూళ్లు సాధించిన తొలి డబ్బింగ్ సినిమాగా నిలిచింది. ప్రముఖ దర్శకుడు కరణ్ జొహార్ ఆధ్వర్యంలోని 'ధర్మా ప్రొడక్షన్స్'పై విడుదలైన 'బాహుబలి' బాలీవుడ్ లో వంద కోట్ల క్లబ్ లో చేరింది. గత ఆదివారంతో ముగిసిన నాలుగు వారాల కలెక్షన్లతో 'బాహుబలి' ఈ ఘనతను సాధించింది. విడుదలైన నాలుగు వారాల్లో 'బాహుబలి' 103.51 కోట్ల రూపాయల వసూళ్లు సాధించిందని ట్రేడ్ అనలిస్టులు తెలిపారు. వంద కోట్ల క్లబ్ లో చేరడంతో కరణ్ జొహార్ దర్శకుడు రాజమౌళిని అభినందనల్లో ముంచెత్తారు. కాగా, బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ 'భజరంగీ భాయ్ జాన్' బరిలో ఉన్నప్పటికీ 'బాహుబలి' వసూళ్లలో మార్పు రాకపోవడం విశేషం.