: రూ. 3.25 లక్షల కోట్లను దేశంలోకి తెచ్చిన టూరిజం


ఇండియాలోకి భారీ ఎత్తున విదేశీ మారక ద్రవ్యాన్ని తీసుకువస్తున్న రంగాల్లో టూరిజం తొలి స్థానంలో నిలిచింది. గడచిన మూడేళ్లలో భారత టూరిజం రంగం రూ. 3.25 లక్షల కోట్లను ఆకర్షించింది. 2012, 2013, 2014 సంవత్సరాల్లో భారత టూరిజం రంగం వరుసగా రూ. 94,487 కోట్లు, రూ. 1,07,671 కోట్లు, రూ. 1,23,320 కోట్ల విదేశీ కరెన్సీని దేశంలోకి తెచ్చిందని కేంద్ర టూరిజం శాఖ సహాయమంత్రి మహేష్ శర్మ సోమవారం నాడు లోక్ సభలో వెల్లడించారు. 2014-15 ఆంధ్రప్రదేశ్ నుంచి 32 టూరిజం ఆధారిత ప్రతిపాదనలు వచ్చాయని, అరుణాచల్ ప్రదేశ్ నుంచి 15, మణిపూర్ నుంచి 14, ఒడిశా నుంచి 11 ప్రతిపాదనలు వచ్చాయని ఆయన వివరించారు. మరింత మంది విదేశీ టూరిస్టులను ఆహ్వానించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ప్రారంభించిన ప్రాజెక్టు తొలి దశలో భాగంగా, అమృతసర్, కేదార్ నాధ్, అజ్మీర్, మధుర, వారణాసి, గయ, పూరి, ద్వారక, అమరావతి, కాంచీపురం, వేళాంకిణీ, గౌహతి తదితర నగరాలను గుర్తించామని, వీటిల్లో మౌలిక వసతులను మెరుగుపరచనున్నామని ఆయన వెల్లడించారు. 12 టూరిజం సర్క్యూట్లను ఇప్పటికే గుర్తించామని, వీటిల్లో హిమాలయా, బుద్ధిస్ట్, రామాయణ వలయాలున్నాయని వివరించారు.

  • Loading...

More Telugu News