: సౌగత్ రాయ్ పై మరోసారి ఆగ్రహించిన స్పీకర్


లోక్ సభలో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సౌగత్ రాయ్ పై స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్చకు తావులేకుండా ఆందోళన చేయడం సరికాదని ఆమె హితవు పలికారు. ఈ సందర్భంగా సౌగత్ రాయ్ మాట్లాడుతూ, స్పీకర్ విపక్షాలను మాట్లాడనీయడం లేదని, నోరుమూయిస్తున్నారని ఆరోపించారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన స్పీకర్, తనకు అందరూ సమానమేనని అన్నారు. విపక్షాలు వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదని విమర్శించారు. వారం రోజులుగా సభ జరుగకుండా అడ్డుకుంటున్నారని ఆమె మండిపడ్డారు. నిన్న జరిగింది మర్చిపోయారా? మళ్లీ అలాగే చేయాలనుకుంటున్నారా? అని అడిగారు. వెంటనే 25 మందిని సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు.

  • Loading...

More Telugu News