: బొత్సా.. తలతిక్క మాటలొద్దు: కేసీఆర్
ఖమ్మం జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయడం కష్టమేనన్న పీసీసీ చీఫ్ బొత్స వ్యాఖ్యలపై టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మండిపడ్డారు. బొత్స తలతిక్క మాటలు మాట్లాడడం మానుకోవాలని సలహా ఇచ్చారు. బయ్యారం ఉక్కు కర్మాగారం సాధన కోసం మే నెలలో ఉద్యమం చేస్తామని కేసీఆర్ తెలిపారు. సీఎం మెడలు వంచైనా సరే, ఖమ్మం జిల్లాలోనే ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయిస్తామని స్పష్టం చేశారు.