: 'బజరంగీ భాయిజాన్' కానున్న మోదీ సర్కారు!
ఇటీవలి సల్మాన్ సూపర్ హిట్ చిత్రం 'బజరంగీ భాయిజాన్' కథను పోలిన విధంగా ఇండియాకు చెందిన గీత అనే అమ్మాయి పాకిస్థాన్ లో 15 సంవత్సరాలుగా వుందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ బాలిక తల్లిదండ్రులు ఎవరో కనిపెట్టేందుకు మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం రంగంలోకి దిగింది. నిజజీవిత 'బజరంగీ భాయిజాన్' కానుంది. ఈ విషయాన్ని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ స్పష్టం చేశారు. పాకిస్థాన్ లోని భారత హైకమిషనర్ ఆ బాలికను కలిసి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తారని ఆమె వివరించారు. తన భార్యను తీసుకుని కరాచీ వెళ్లి బాధితురాలిని కలవాలని పాక్ లోని భారత హైకమిషనర్ రాఘవన్ ను ఆదేశించినట్టు ఆమె తెలిపారు. ప్రస్తుతం 23 సంవత్సరాల వయసున్న ఈ యువతి తన 8 సంవత్సరాల వయసులో పాకిస్థాన్ సరిహద్దుల్లో పట్టుబడిన సంగతి తెలిసిందే.