: అవి విమర్శలు, ఆరోపణలే...వాస్తవం కాదు: రాజ్ నాథ్ సింగ్
కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్, ముఖ్యమంత్రులు వసుంధర రాజె, శివరాజ్ సింగ్ చౌహాన్ లు రాజీనామా చేయాల్సిన అవసరం లేదని కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పష్టం చేశారు. లోక్ సభలో ఆయన మాట్లాడుతూ, సుష్మాస్వరాజ్, వసుంధర రాజె, శివరాజ్ సింగ్ చౌహాన్ తదితరులపై కాంగ్రెస్ పార్టీ చేసినవి ఆరోపణలేనని, తమ పార్టీకి చెందిన నేతలు ఎలాంటి తప్పు చేయలేదని అన్నారు. విపక్షాలు అధికారపార్టీపై చేసే ఆరోపణలు, విమర్శలు ఫిర్యాదులు కావని గుర్తించాలని ఆయన సూచించారు. వాస్తవాలు చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కలుగజేసుకున్న కాంగ్రెస్ నేతలు, ఆరోపణలు ఊరికే రావని, చర్చకు ముందు చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. దీంతో లోక్ సభలో గందరగోళం నెలకొంది.