: ఇంటెక్స్ ప్రచారకర్తగా ప్రిన్స్ మహేష్ బాబు


స్మార్ట్ ఫోన్లను విక్రయిస్తున్న ఇంటెక్స్ సంస్థ, తన ఉత్పత్తుల ప్రచారం నిమిత్తం బ్రాండ్ అంబాసిడర్ గా టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబును ఎంచుకుంది. ఈ మధ్యాహ్నం హైదరాబాద్ లోని ఓ స్టార్ హోటల్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఇంటెక్స్ ప్రతినిధులు మహేష్ బాబుతో కుదుర్చుకున్న డీల్ విషయాన్ని వివరించారు. టాలీవుడ్ లో ప్రిన్స్ గా, కోట్లాది మంది అభిమానులున్న హీరోగా గుర్తింపున్న మహేష్ చేరికతో ఇంటెక్స్ స్మార్ట్ ఫోన్ల విక్రయాలు భారీగా పెరుగుతాయని భావిస్తున్నట్టు సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు. మహేష్ బాబు మాట్లాడుతూ, అందరికీ అందుబాటు ధరల్లో స్మార్ట్ ఫోన్లను ఇంటెక్స్ విక్రయిస్తోందని, ఆ సంస్థతో చేతులు కలపడం తనకు సంతోషాన్ని కలిగిస్తోందని అన్నారు. శ్రీమంతుడు చిత్రం థియేటర్లలో విడుదలయ్యే క్షణం కోసం అభిమానులతో పాటు తాను కూడా ఎదురుచూస్తున్నట్టు తెలిపాడు.

  • Loading...

More Telugu News