: అప్పటి దాకా పార్లమెంటు సమావేశాలను జరగనివ్వం: రేణుకా చౌదరి
అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ నేతలు రాజీనామా చేయాల్సిందేనని కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి అన్నారు. వారు రాజీనామా చేసేంత వరకు పార్లమెంటును జరగనీయమని చెప్పారు. గత వారం రోజులుగా సభాకార్యక్రమాలు నిలిచిపోతే... అధికారపక్షం ఇప్పుడు చర్చలు జరపడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. ఈరోజు లోక్ సభ వాయిదా పడిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ సమావేశాలు సజావుగా జరగాలంటే సుష్మాస్వరాజ్, వసుంధర రాజే, శివరాజ్ సింగ్ చౌహాన్ లు రాజీనామా చేయాల్సిందేనని అన్నారు.