: సీఎం పదవికి అడ్డొస్తాడనే బాలకృష్ణకు ఫస్ట్ ర్యాంక్... సీపీఎం కార్యదర్శి విమర్శ
హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు ఎమ్మెల్యేల పనితీరు విషయలో మొదటి ర్యాంక్ ఇవ్వడంపై అనంతపురం జిల్లాకు చెందిన సీపీఎం కార్యదర్శి వి.రాంభూపాల్ విమర్శలు చేశారు. బాలయ్యకు తొలి ర్యాంకు ఇవ్వడం హాస్యాస్పదమన్నారు. తెలంగాణలో నివసిస్తున్న ఆయనకు మొదటి ర్యాంకా? అని ప్రశ్నించారు. ఈ ర్యాంకులన్నీ బోగస్సేనని, తన సీఎం పదవికి అడ్డొస్తాడేమోనన్న భయంతోనే బాలయ్యకు తొలి ర్యాంకు ఇచ్చారని ఆరోపించారు. డబ్బులు లేవంటూనే గోదావరి పుష్కరాలకు ప్రభుత్వం రూ.1600 కోట్లు ఎలా ఖర్చు చేసిందని అడిగారు.