: సెలబ్రిటీలతో ప్రచారం... ర్యాగింగ్ నిరోధానికి ఏపీ సర్కారు కొత్త మంత్రం


గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో బీఆర్క్ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య ఘటన, ర్యాగింగ్ పై నిరోధానికి ఏపీ ప్రభుత్వాన్ని కార్యోన్ముఖురాలిని చేసింది. ఇప్పటికే రిషితేశ్వరి ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం, మరోవైపు విద్యాలయాల్లో ర్యాగింగ్ కు చెక్ పెట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా ర్యాగింగ్ కు పాల్పడే విద్యార్థులకు జీవిత ఖైదు విధించేందుకు కూడా ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన ఏపీ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు పలు విషయాలను వెల్లడించారు. ర్యాగింగ్ నిరోధంపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు సెలబ్రిటీలతో ప్రచారం చేయించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News