: ఈనెల 5న టీటీడీపీ ధర్నా


పేదలకు ఇళ్లు కట్టిస్తామని చెప్పిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదని టీటీడీపీ నేత ఎర్రబెల్లి దయాకరరావు మండిపడ్డారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఈ నెల 5న దీక్ష చేపడుతున్నామని ఆయన తెలిపారు. ఈ మేరకు తెలంగాణలోని విపక్ష పార్టీల ఫ్లోర్ లీడర్లకు ఎర్రబెల్లి లేఖలు రాశారు. పేదల అభ్యున్నతి కోసం తాము చేపడుతున్న దీక్షకు మద్దతు ఇవ్వాలని లేఖలో కోరారు. పేదలకు అన్ని విధాలా అండగా ఉంటామని... ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పనిచేస్తామని చెప్పారు.

  • Loading...

More Telugu News