: టీఆర్ఎస్ 'తాలిబన్ ఆఫ్ తెలంగాణ'గా వ్యవహరిస్తోంది: షబ్బీర్ అలీ


కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి షబ్బీర్ అలీ టీఆర్ఎస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. అవసరమైతే చార్మినార్ ను కూడా కూల్చాల్సి ఉంటుందని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీపై మండిపడ్డారు. పూర్వం ఔరంగజేబు గోల్కొండ కోటపై దాడి చేసి అనేక భవనాలను కూల్చాడని, చార్మినార్ ను మాత్రం వదిలిపెట్టాడని గుర్తు చేశారు. కానీ ఉపముఖ్యమంత్రి మాత్రం దాన్నే కూలుస్తామనడం దారుణమన్నారు. తాలిబన్లు, ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు తమ ఆధిపత్యాన్ని నిరూపించుకోడానికి భవనాలు కూలుస్తుంటే తెలంగాణలో కేసీఆర్ కూడా సచివాలయం, చెస్ట్, ఉస్మానియా ఆసుపత్రుల భవనాలను కూలుస్తున్నారని షబ్బీర్ విమర్శించారు. ఈ క్రమంలో ఆ పార్టీకి కొత్త నిర్వచనం చెప్పారు. టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి కాదని, 'తాలిబన్ ఆఫ్ తెలంగాణ' అని వ్యాఖ్యానించారు. ఆ పార్టీ అచ్చం తాలిబన్ల లానే వ్యవహరిస్తోందని ఆరోపించారు.

  • Loading...

More Telugu News