: సుప్రీంకోర్టులో నటుడు మోహన్ బాబుకు ఊరట... 'పద్మశ్రీ' కొనసాగుతుందని వెల్లడి
సినీ నటుడు మోహన్ బాబుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆయన పద్మశ్రీని కొనసాగించాలని తీర్పు వెల్లడించింది. సినిమా టైటిళ్లలో తన పేరుకు ముందు 'పద్మశ్రీ' టైటిల్ని వేయించుకుంటూ మోహన్ బాబు దుర్వినియోగం చేస్తున్నారంటూ గతంలో హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దాంతో ఆయన పద్మశ్రీని వెనక్కి ఇచ్చివేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో సుప్రీంకు వెళ్లిన ఆయన, తాను పురస్కారాన్ని దుర్వినియోగం చేయబోనంటూ అఫిడవిట్ దాఖలు చేశారు. ఈ క్రమంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈ నేపథ్యంలో మోహన్ బాబుకు పద్మశ్రీ కొనసాగుతుందని స్పష్టం చేసింది.