: రహీం బాబా తాట తీశారు
రంగారెడ్డి జిల్లా బంటారం మండలం తోరుమామిడిలో తిష్ట వేసిన నకిలీ బాబా 'రహీం బాబా'కు స్థానికులు తాట తీశారు. ఆరు నెలల క్రితం కర్ణాటక నుంచి ఈ నకిలీ బాబా బంటారం వచ్చాడు. ఆ మాట, ఈ మాట చెబుతూ జనాలను బుట్టలో వేసుకుంటున్న రహీం ఆగడాలు మెల్లమెల్లగా శృతిమించడం మొదలైంది. మహిళలను లైంగికంగా వేధించడం కూడా మొదలు పెట్టాడు. ఈ ఆగడాలను గమనించిన స్థానికుల్లో ఆగ్రహం పెల్లుబికింది. అందరూ కలసి నకిలీ బాబాకు దేహశుద్ధి చేశారు. ప్రస్తుతం రహీంను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతన్ని విచారిస్తున్నారు. దొంగ బాబాను కఠినంగా శిక్షించాలని మహిళలు డిమాండ్ చేస్తున్నారు.