: కోల్ స్కాం కేసులో మాజీ సెక్రటరీ హెచ్.సీ గుప్తాకు బెయిల్
సంచలనం సృష్టించిన బొగ్గు కుంభకోణం కేసులో బొగ్గు శాఖ మాజీ సెక్రటరీ హెచ్.సీ గుప్తాకు ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆయనతో పాటు పుష్ప్ స్టీల్స్ అండ్ మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ అతుల్ జైన్ కు కూడా బెయిల్ ఇచ్చింది. బెయిల్ కింద వ్యక్తిగత పూచీకత్తుతో ఇద్దరూ చెరొక రూ.లక్ష బాండు సమర్పించాలని ఆదేశించింది. వారిద్దరూ సాక్ష్యాన్ని తారుమారు చేయరని, విచారణకు సహకరిస్తారని సీబీఐ జడ్జి పేర్కొన్నారు. తదుపరి విచారణను కోర్టు ఈ నెల 26కు వాయిదా వేసింది.