: కేంద్రంతో స్నేహంగా ఉంటూనే ప్రత్యేక హోదా సాధించాలి: టీజీ


ప్రత్యేక హోదాపై కేంద్ర ప్రభుత్వం ఇటీవల చేసిన ప్రకటనతో బీజేపీ, టీడీపీ మధ్య విభేదాలు వస్తాయని అంతా అనుకున్నారు. కానీ టీడీపీ నేతలు, ఏపీ ప్రభుత్వం మాత్రం కేంద్రంపై డైరెక్టుగా ఎలాంటి ఆరోపణలు, విమర్శలు చేయకుండా సహనంతో వున్నారు. ఇదే క్రమంలో టీడీపీ నేత టీజీ వెంకటేష్ కర్నూలులో మీడియాతో మాట్లాడుతూ, బీజేపీతో విభేదిస్తే రాష్ట్రానికే నష్టమని సూచించారు. ఈ విషయంలో వెంకయ్యనాయుడు, చంద్రబాబులను దూషించినా హోదా రాదని టీజీ పేర్కొన్నారు. కేంద్రంతో మంచిగా ఉంటూనే ప్రత్యేక హోదా సాధించుకోవాలని హితబోధ చేశారు. రాయలసీమలో రాష్ట్రానికి రెండో రాజధాని ఏర్పాటు చేయాలని ఆయన ఉద్ఘాటించారు.

  • Loading...

More Telugu News