: తెలుగుదేశం నేతల పేర్లు చెప్పాలని ఏసీబీ వేధిస్తోంది: జడ్జికి తెలిపిన ఉదయసింహ
'ఓటుకు నోటు' కేసులో తెలుగుదేశం పార్టీ నేతల పేర్లు చెప్పాలని తెలంగాణ ఏసీబీ అధికారులు తనపై ఒత్తిడి తెస్తున్నారని, ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఉదయసింహ ఆరోపించారు. కేసు విచారణలో భాగంగా ఏసీబీ ప్రత్యేక కోర్టుకు వచ్చిన ఉదయసింహ, ఏసీబీ వేధింపులు ఎక్కువయ్యాయని జడ్జి ముందు వాపోయారు. మధ్యవర్తుల సమక్షంలో నేరాన్ని అంగీకరిస్తూ, పత్రాలపై బలవంతంగా సంతకాలు పెట్టించాలని ఏసీబీ అధికారులు చూస్తున్నారని, తాను చెప్పే విషయాలు కాకుండా, వారి ఇష్ట ప్రకారం ఈ నేరాంగీకార పత్రాలు తయారు చేశారని తెలిపాడు. కాగా, ఈ ఆరోపణలను విన్న న్యాయమూర్తి ఈ కేసు తదుపరి విచారణను 14వ తేదీకి వాయిదా వేశారు.