: ఓటుకు నోటు కేసులో సెబాస్టియన్, ఉదయసింహలకు స్వల్ప ఊరట


ఓటుకు నోటు కేసులో నిందితులుగా ఉన్న సెబాస్టియన్, ఉదయసింహలకు స్వల్ప ఊరట లభించింది. ఈ కేసులో వారిద్దరి బెయిల్ షరతులను కోర్టు కొంతమేర సడలించింది. ఇక నుంచి ఈ కేసులో ప్రతిరోజు కాకుండా... వారంలో సోమవారం, గురువారం, శుక్రవారం మాత్రమే ఏసీబీ అధికారుల ఎదుట హాజరుకావాలని ఈరోజు విచారణ సమయంలో ఏసీబీ కోర్టు తెలిపింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

  • Loading...

More Telugu News