: 'గొరిల్లా ఫేస్' మిచెల్... 'మంకీ ఒబామా'కే ఇష్టం: వాషింగ్టన్ మేయర్ సంచలన వ్యాఖ్య
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కుటుంబాన్ని కోతులు, గొరిల్లాలతో పోల్చిన వాషింగ్టన్ మేయర్ పాట్రిక్ రుషింగ్ పెను వివాదాన్ని రేపాడు. తొలి మహిళ మిచెల్ ఒబామాది 'గొరిల్లా ఫేస్' అని తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్టు చేశాడు. "మిచెల్ ది గొరిల్లా ముఖం. కాదని అనలేరు. ఈ మహిళ 'మంకీ మ్యాన్ ఒబామా'కు తప్ప మరెవరికీ ఆకర్షణీయం కాదు. కావాలంటే వారి చెవులు చూడండి" అని అన్నారు. పాట్రిక్ వ్యాఖ్యలపై అమెరికా వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆయన తక్షణమే పదవి నుంచి తప్పుకోవాలని ఎయిర్ వే హైట్స్ సిటీ కౌన్సిల్ డిమాండ్ చేసింది. దీనికి ఆయన నిరాకరించాడు. "నేను తప్పు చేశాను. నా తప్పు నాకు తెలుసు. ఒకవేళ నేను రాజీనామా చేస్తే, నేను జాతి విద్వేష పూరితుడినని ఒప్పుకున్నట్టు అవుతుంది. కానీ నేను కాదు" అని ఆయన అన్నారట.