: లోక్ సభలో ప్లకార్డులు పట్టిన టీఆర్ఎస్... హైకోర్టు విభజన కోసం ఎంపీల నిరసన


పార్లమెంటు ఉభయ సభలు కొద్దిసేపటి క్రితం ప్రారంభమయ్యాయి. లోక్ సభ ప్రారంభం కాగానే టీఆర్ఎస్ ఎంపీలు ప్లకార్డులు చేతబట్టి నిరసన గళం వినిపించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో హైకోర్టును కూడా తక్షణమే విభజించాలని వారు డిమాండ్ చేశారు. ఇప్పటికే పార్లమెంటు ఆవరణలో ఓ సారి నిరసన గళం విప్పిన టీఆర్ఎస్ ఎంపీలు తాజాగా లోక్ సభలోనే ఆందోళనకు దిగారు. సభలో తమ స్థానాల్లో నుంచి పైకి లేచిన ఎంపీలు ప్లకార్డులు చేతబట్టి స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. అయితే లలిత్ మోదీ, వ్యాపం స్కాంలపై విపక్షాలన్నీ నిరసన తెలిపిన నేపథ్యంలో టీఆర్ఎస్ ఎంపీల ఆందోళన పెద్దగా కనిపించలేదు.

  • Loading...

More Telugu News