: మంత్రుల చేత రాజీనామా చేయించాకే లోక్ సభలో చర్చిస్తాం: సోనియాగాంధీ
పార్లమెంటు సమావేశాలు సజావుగా సాగడానికి సహకరించడంపై కాంగ్రెస్ పార్టీ మొండి పట్టుదలతో ఉంది. వ్యాపం స్కాం, లలిత్ మోదీ వ్యవహారంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ మంత్రులు, సీఎంల చేత రాజీనామా చేయించాల్సిందేనని డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు ఢిల్లీలో జరుగుతున్న కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో అధినేత్రి సోనియాగాంధీ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ముందు చర్చించిన తరువాతే చర్యలు అంటున్న బీజేపీ వైఖరి సరికాదని, అందుకు తాము అంగీకరించబోమని స్పష్టం చేశారు. బలమైన ఆధారాలతో కీలకమైన అంశాన్ని లేవనెత్తామని, ఆధారాలు ఉన్నా ప్రభుత్వం చర్యలు తీసుకునేందుకు ఎందుకు వెనుకాడుతోందణి అన్నారు.