: అమ్మా! నువ్వు చెప్పాల్సిన మాటలివేనా?: రంగంలో మహంకాళిని ప్రశ్నించిన ప్రధాన పూజారి


దేవదాసి స్వర్ణలత రూపంలో పచ్చికుండపై నిలబడి భవిష్యవాణి చెబుతూ, భక్తులు, నేతలు, ఆలయ సిబ్బందిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని శాంతింపజేసేందుకు ఆలయ పూజారులు కల్పించుకోవాల్సి వచ్చింది. ఎందరు అధికారులు, సిబ్బంది, పోలీసులు ఉన్నా, తన భక్తులు తన వద్దకు రావాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తనకు ఏ రకమైన సేవలూ సంతృప్తికరంగా జరగడం లేదని, వర్షాలు పడకపోవడానికి అదే కారణమని అమ్మ చెప్పిన మాటలు భక్తుల్లో ఆందోళన పెంచాయి. దీంతో ఆలయ ప్రధాన పూజారి స్పందించి, అమ్మవారికి జరుపుతున్న సేవలు, కార్యక్రమాలను వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం, మంత్రులు ఎంతో భక్తితో సేవలు చేశారని గుర్తు చేస్తూ, ప్రజలను కాపాడాల్సిన తల్లివి నువ్వే ఇలా మాట్లాడితే ఎలా? నువ్వు చెప్పాల్సిన మాటలివేనా? అని ప్రశ్నించారు. దీనికి స్పందించిన అమ్మ, రక్షించేది, శిక్షించేది తానేనని, కష్టాలను తీర్చేది, అవసరాలకు ఆదుకునేది తానేనని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News