: ఏసీబీ అధికారులు బెదిరిస్తున్నారు... కోర్టుకు ఉదయసింహ ఫిర్యాదు
ఓటుకు నోటు కేసులో కొద్దిసేపటి క్రితం ఏసీబీ కోర్టులో జరిగిన విచారణ సందర్భంగా కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. కేసులో రాజకీయ నేతలకు ప్రమేయముందని చెప్పమంటూ ఏసీబీ అధికారులు తనను వేధిస్తున్నారని కేసులో సహ నిందితుడిగా ఉన్న ఉదయసింహ న్యాయమూర్తికి ఫిర్యాదు చేశారు. విచారణ పేరిట తనను వేధింపులకు గురి చేసిన ఏసీబీ అధికారులు, తాము చెప్పినట్లు వినాలని కూడా బెదిరిస్తున్నారని ఆయన కోర్టుకు విన్నవించారు. ఏసీబీ అధికారుల వేధింపుల నుంచి తనకు విముక్తి కల్పించాలని ఆయన న్యాయమూర్తిని కోరారు.