: నా కోసం మీరేం చేశారు?: 'రంగం'లో స్వర్ణలత
ఉజ్జయిని మహంకాళి జాతరలో భాగంగా రంగం కార్యక్రమం వైభవంగా ముగిసింది. దేవదాసి స్వర్ణలత పచ్చికుండపై నిలబడి తన భవిష్యవాణి వినిపించారు. నాకోసం మీరేం చేశారని ప్రశ్నించారు. ఎవరికి వారు తాము ఎంత దోచుకుందామనే చూస్తున్నారని, ఎవరు ఎంత దోచుకున్నా వాళ్లకు శిక్ష తప్పదని స్పష్టం చేశారు. దుష్టులు ప్రవర్తన మార్చుకోవాలని, ప్రజల్లో చెడు ఆలోచనలు పెరిగాయని అన్నారు. అయినా తను శాంతితో ఉన్నానంటే, భక్తులే కారణమని, భక్తుల కష్టసుఖాలు తనకు తెలుసునని, ఆశీర్వదించాల్సింది, పెట్టేది, తిట్టేది, శిక్షించేది తానేనని అన్నారు. వర్షాలు పడాలంటే దైవ పూజలు చేయాలని, ఈ సంవత్సరం పూజలు సరిగ్గా జరగలేదని అన్నారు.