: హైదరాబాదులో రేవంత్ రెడ్డి!...ఏసీబీ కోర్టు విచారణకు హాజరు
ఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితుడు, టీ టీడీఎల్పీ ఉపనేత రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితం హైదరాబాదులో అడుగుపెట్టారు. కేసు విచారణ నిమిత్తం ఏసీబీ కోర్టుకు హాజరయ్యేందుకు ఆయన హైదరాబాదు వచ్చారు. మహబూబ్ నగర్ జిల్లాలోని తన సొంతూరు కొడంగల్ నుంచి నేటి ఉదయం హైదరాబాదు వచ్చిన ఆయన నేరుగా కోర్టుకు వెళ్లారు. కోర్టు విచారణ ముగియగానే తిరిగి ఆయన కొడంగల్ కు బయలుదేరతారు. ఇదిలా ఉంటే, రేవంత్ రెడ్డితో పాటు కేసులో సహ నిందితులుగా ఉన్న సెబాస్టియన్, ఉదయ సింహలు కూడా నేటి కోర్టు విచారణకు హాజరయ్యారు.