: తెలివితేటల్లో ఐన్ స్టీన్ నే దాటేసిన 12 ఏళ్ల బాలిక
ప్రపంచానికి పరిచయం అవసరం లేని పేరు ఆల్బర్ట్ ఐన్ స్టీన్. తన సాపేక్షితా సిద్ధాంతం (థీరీ ఆఫ్ రిలేటివిటీ)తో విశ్వ రహస్యాలు వెలుగు చూడడానికి కారకుడైన ఆయన ఐక్యూ (ఇంటెలిజన్స్ కోషంట్) 160 అని శాస్త్రవేత్తలు తేల్చారు. ఆ స్థాయిలో ఐక్యూ ఉండి, మన మధ్య ఉన్నవారిలో ప్రముఖ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ ఒకరు. ఈ జాబితాలో తాజాగా మరొకరు చేరిపోయారు. బ్రిటన్ లోని హార్లో ప్రాంతానికి చెందిన నికోల్ బార్ అనే అమ్మాయి మెన్సా పరీక్షలో 162 ఐక్యూను పొంది అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఈ బాలిక వయసు కేవలం 12 సంవత్సరాలు మాత్రమే కావడం విశేషం. ఐక్యూలో ఐన్ స్టీన్ నే దాటేసిన బాలిక ఇప్పుడు మేధావి వర్గంలో చేరిపోయింది.