: పాకిస్థాన్ ప్రధానిపై మాజీ సైనికుడి దాడి... ప్రాణాలతో బయటపడ్డ నవాజ్ షరీఫ్


పాకిస్థాన్ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ లక్ష్యంగా నిన్న ఆ దేశ వైమానిక దళానికి చెందిన మాజీ అధికారి మెరుపు దాడికి దిగాడు. కారుతో వేగంగా దూసుకువచ్చిన రిటైర్ట్ ఎయిర్ కమాండర్ హఫీజ్ ఉర్ రెహ్మాన్, నవాజ్ షరీఫ్ కుటుంబం ప్రయాణిస్తున్న వాహనాన్ని బలంగా ఢీకొట్టాడు. అయితే ఈ ప్రమాదంలో నవాజ్ షరీఫ్, ఆయన కుటుంబ సభ్యులు సురక్షితంగా బయటపడ్డారు. పాక్ పట్టణం ముర్రీలోని హిల్ రిసార్ట్ నుంచి ఇస్లామాబాద్ కు తిరిగివస్తున్న క్రమంలో షరీఫ్ పై ఈ దాడి జరిగింది. నకిలీ నెంబర్ ప్లేట్ కలిగిన కారుతో వేగంగా దూసుకువచ్చిన రెహ్మాన్ తొలుత షరీఫ్ కాన్వాయ్ ను ఓవర్ టేక్ చేశాడు. ఆ తర్వాత షరీఫ్ ఉన్న కారును తన కారుతో ఢీకొట్టాడు. వెనువెంటనే అప్రమత్తమైన పోలీసులు రెహ్మాన్ ను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతడిని పోలీసులు విచారిస్తున్నారు.

  • Loading...

More Telugu News